English | Telugu

ఎన్టీఆర్ పుట్టినరోజున 'రభస' టీజర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రభస'. ఈ వేసవిలోనే ధియేటర్లలో రభస చేయాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమా స్క్రిప్ట్ సరిగా లేదని కొన్ని రోజులు ఆతరువాత డైరెక్టర్ శ్రీనివాస్‌కు జాండిస్ అటాక్ కావడంతో మరి కొన్ని రోజులు సినిమా షెడ్యూల్స్ డిలే అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ టీజర్ ను యంగ్ టైగర్ బర్త్ డే కానుకగా మే20న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీయార్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, ప్రణీత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.