English | Telugu

టాలీవుడ్‌ చరిత్రలో అరుదైన గౌరవం ఆ మెగా హీరోలకే దక్కింది!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సినిమాలకు లోటు లేదు. దేశంలోనే ఎక్కువ సినిమాల నిర్మాణం జరిగేది టాలీవుడ్‌లోనే. అలాంటి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం ఎంత.. అంటే మొన్నటివరకు లేదనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో మహామహులైన నటీనటులు ఉన్నారు. దేశంలోని ఏ కళాకారుడికీ తీసిపోనంత సమర్థత తెలుగువారికి ఉంది. కానీ, ఇనేళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడిగా ఒక్కరూ ఎంపిక కాకపోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఆ లోటు చిత్ర పరిశ్రమను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. అయితే ఆ లోటును అల్లు అర్జున్‌ భర్తీ చేశాడు. ‘పుష్ప’ చిత్రంలోని తన అద్భుతమైన నటనతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు.

ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తండ్రి 16ఏళ్ళ కలను నిజం చేశాడు. 2007వ సంవత్సరంలో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవంలో పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ తాను గోవా ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లినపుడు అక్కడ ఎంతో నటీనటుల ఫోటోలు కనిపించాయని, ఒక్క తెలుగు నటుడి ఫోటోను అక్కడ తాను చూడలేదని అన్నారు. తెలుగులో ఎంతో గొప్ప కళాకారులు ఉన్నప్పటికీ వారికి తగిన గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్‌లో రామ్‌చరణ్‌ ఫోటోను పెట్టడం జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న చరణ్‌ కటౌట్‌ను అక్కడ ప్రదర్శించారు. దీంతో మెగాస్టార్‌ ఆనందాన్ని అవధుల్లేకుండా పోయింది. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడికీ దక్కని గౌరవం చరణ్‌కి దక్కినందుకు తండ్రిగా చిరంజీవి ఎంతో సంతోషిస్తున్నారు. 54వ అంతర్జాతీయ చలన చిత్స్రోతవంలో రామ్‌చరణ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. గోవా ఫిలిం ఫెస్టివల్‌ ఎంట్రీ గేటు వద్ద రామ్‌ చరణ్‌ మరియు అనుష్క ఫోటోలు కనిపించాయి. దీంతో మెగా ఫ్యాన్స్‌ రామ్‌చరణ్‌ ఫోటోని చూసి ఎంతో ఆనందించారు. ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘తండ్రి కలం నిజం చేసిన కొడుకు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, 53వ ఫిలిం ఫెస్టివల్‌లో గత ఏడాది ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును మెగాస్టార్‌ చిరంజీవి అందుకున్న విషయం తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.