English | Telugu
నితిన్ ముహూర్తం ప్రారంభం
Updated : Feb 24, 2014
"హార్ట్ ఎటాక్" చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ హీరోగా మరో చిత్రం ప్రారంభం అయ్యింది. శ్రవణా మూవీస్ బ్యానర్లో నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. "సరికొత్త ప్రేమకథతో ఈసారి మీ ముందుకొస్తున్నాం. నితిన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు కథని సిద్ధం చేసారు. వచ్చే నెల మూడోవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాము" అని అన్నారు నిర్మాత. సంగీతం సాగర్ అందిస్తున్నాడు.