English | Telugu
కోల్ కతాకు వెళ్లనున్న పవర్
Updated : Feb 25, 2014
రవితేజ హీరోగా ప్రముఖ రచయిత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పవర్". ఇటీవలే హైదరాబాదులో షూటింగ్ పూర్తి చేసుకొంది. మార్చి తొలివారంలో కోల్ కతా షెడ్యుల్ మొదలవుతుంది. ఈ షెడ్యుల్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచే బ్యాంకాక్ వెళ్లనున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.