English | Telugu

పవన్ హిట్టుతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో

"అత్తారింటికి దారేది" చిత్రం విడుదలకు ముందు రాష్ట్రంలో ఉద్యమ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్ర పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న హీరో నితిన్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా వాయిదాల కారణంగా కొద్దిగా బాధపడ్డాడు. అయితే ఇటీవలే అన్ని అడ్డంకులను దాటుకొని ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతుంది. ఈ సంధర్భంగా నితిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని నితిన్ ఎప్పుడు చెప్తుంటాడు. అలాంటి తన హీరో చిత్రం తనకు ఇంతటి సక్సెస్ ను అందించడం వలన నితిన్ చాలా సంతోషంగా ఉన్నాడట.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.