English | Telugu

నితిన్ అత‌నికి అన్యాయం చేశాడు

గురువారం విడుద‌లైన చిన్న‌దాన నీకోసం ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. క‌రుణాక‌ర‌న్‌కి ఇక ఛాన్సులు ఇచ్చే ఛాన్సే లేద‌ని విశ్లేష‌కులు కూడా తేల్చేస్తున్నారు. ఆయ‌న డైరెక్ష‌న్ ఆ రేంజులో ఉంది మ‌రి. అయితే... చిన్న‌దాన ఫ్లాప్ వెనుక క‌రుణాక‌ర‌న్ చేసిందేం లేద‌ట‌. ఎందుకంటే క‌రుణాక‌ర‌న్‌ని ప‌క్క‌న పెట్టి నితిన్‌, ఆండ్రూ, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఈ ముగ్గురూ క‌ల‌సి డైరెక్ష‌న్ చేసేసుకొన్నార్ట‌. క‌రుణాక‌ర‌న్ ఆలోచ‌న‌ల‌కు అస్స‌లు ఎవ్వ‌రూ వాల్యూ ఇవ్వ‌లేద‌ని, క‌నీసం ఆయ‌న్ని డైరెక్ట‌ర్ గా కూడా చూడ‌లేద‌ని ఇన్ సైడ్ టాక్‌. అందుకే మీడియాని ఇంట‌ర్వ్యూకు పిలిచిన క‌రుణాక‌ర‌న్ అక్క‌డేం మాట్లాడ‌లేద‌ట‌. మీడియావాళ్లు ఎన్ని ప్ర‌శ్న‌లు వేసినా క‌రుణాక‌ర‌న్ స‌మాధానం చెప్ప‌లేద‌ట‌. `సినిమా చూడండి.. ఆ త‌ర‌వాత మాట్లాడుకొందాం..` అని సున్నితంగా త‌ప్పించుకొన్నాడ‌ట‌. ఈ సినిమా క‌రుణాక‌ర‌న్ కెరీర్‌కి చాలా ముఖ్యం, హిట్ట‌యితేనే మ‌రో అవ‌కాశం వ‌చ్చేది. డూ ఆర్ డై సెట్యువేష‌న్‌లో ఉన్న ద‌ర్శ‌కుడితో నితిన్ ఆడుకొన్నాడ‌ని, అస‌లు డైరెక్ష‌న్ చేసే ఛాన్సే ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. అంత న‌మ్మ‌కం లేన‌ప్పుడు మ‌రి క‌రుణాక‌ర‌న్‌ని ఎందుకు తీసుకొన్న‌ట్టో. చిన్న‌దానా నీ కోసం ఫ్లాప్ వ‌ల్ల నితిన్‌కి అర్జెంటుగా వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు. కానీ క‌రుణాక‌ర‌న్ కెరీర్‌కి దాదాపుగా శుభం కార్డు ప‌డిపోయిన‌ట్టే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.