English | Telugu
కాస్ట్‌లీ గిఫ్ట్ పట్టేసిన అనిల్ రావిపూడి.. కారు విలువెంతో తెలుసా?
Updated : Nov 28, 2023
సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి నిర్మాత ఖరీదైన కారు గిఫ్ట్ ఇవ్వడం ఈమధ్య ట్రెండ్ గా మారింది. ఇప్పటికే పలువురు దర్శకులు ఖరీదైన కార్లను బహుమతులుగా పొందారు. ఇప్పుడు ఆ లిస్టులో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చేరాడు.
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇటీవల ఓటీటీలో విడుదలై అక్కడా రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ అనిల్ కి నిర్మాత సాహు 'టయోటా వెల్‌ఫైర్' అనే ఒక కాస్ట్ లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ కారు ఖరీదు సుమారుగా రూ.1.5 కోట్లు. ఇలాంటి గిఫ్ట్ ల వల్ల దర్శకులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అనడంలో సందేహం లేదు.
శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్రలు పోషించిన 'భగవంత్ కేసరి' చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సినిమాటోగ్రాఫర్ గా రామ్ ప్రసాద్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరించారు.