English | Telugu
రివ్యూలకు చెక్.. నిఖిల్ 'స్పై'కి రికార్డు ఓపెనింగ్స్!
Updated : Jun 30, 2023
నిఖిల్ హీరోగా నటించిన 'స్పై' మూవీ మంచి అంచనాలతో నిన్న(జూన్ 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాకి రివ్యూలు అన్నీ దాదాపు నెగటివ్ గానే వచ్చాయి. కానీ రివ్యూలు ఈ మూవీ ఓపెనింగ్స్ పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది.
'స్వామిరారా' నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ని అందుకొని తన మార్కెట్ ని పెంచుకున్నాడు. ఆ విషయం 'స్పై' ఫస్ట్ డే కలెక్షన్స్ తో మరోసారి రుజువైంది. 'కార్తికేయ-2' మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల షేర్ రాబట్టగా, 'స్పై' మూవీ నెగటివ్ రివ్యూలతో కూడా రూ.6 కోట్ల షేర్ రాబట్టింది.
మొదటిరోజు నైజాంలో రూ.1.72 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.56 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.2 కోట్ల షేర్ రాబట్టిన స్పై చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.4.28 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.46 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.28 కోట్ల షేర్ కలిపి మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.6.02 కోట్ల షేర్(రూ.10.45 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా రూ.17.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ మొదటి రోజు 34 శాతం రికవర్ చేసింది. బ్రేక్ సాధించి హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా రూ.12 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటు, లాంగ్ వీకెండ్ 'స్పై' కి కలిసొచ్చింది. మరి టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.