English | Telugu

మెగా దర్శకుడితో అల్లరి నరేష్ మూవీ.. బార్ లో ప్రకటన!

ఒకప్పుడు కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్ కొంతకాలంగా విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈరోజు(జూన్ 30) నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 62వ సినిమా ప్రకటన వచ్చింది. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు దర్శకుడు కావడం విశేషం.

నరేష్ 62వ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో విభిన్నంగా ఆకట్టుకునేలా ఉంది. మీకొక కథ చెప్పాలంటూ నరేష్ కి దర్శకుడు సుబ్బు ఫోన్ చేస్తాడు. సరే ఆఫీస్ రమ్మని నరేష్ చెప్తే, సుబ్బు నో అంటాడు. పోనీ కాఫీ షాప్ లేదా టెంపుల్ కి రా అంటే దానికి కూడా నో అంటాడు. మరి ఎక్కడ చెప్తావ్ అని నరేష్ అడిగితే, సుబ్బు ఓ బార్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక "మనిషిలో బీపీ, షుగర్ ఎంత ఉన్నాయో కనుక్కోవడానికి మిషన్స్ ఉన్నాయి కానీ మూర్ఖత్వం ఎంతుందో కనుక్కోవడానికి మిషన్స్ లేవు. మూర్ఖత్వం బోర్డర్ దాటేసినోడి కథే సార్ ఇది" అంటూ నరేష్ కి సుబ్బు స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో చెప్తాడు. అదే ఫ్లోలో టెక్నీషియన్స్ ని కూడా కాస్త క్రియేటివిటీతో పరిచయం చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ప్రొడక్షన్ డిజైనర్ గా బ్రహ్మ కడలి, ఎడిటర్ గా ఛోటా కె. ప్రసాద్ వ్యవహరించనున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.