English | Telugu

నా సినిమా కి అన్యాయం జరిగిందంటున్న నిఖిల్ 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరి అండ దండలు లేకుండా తన స్వయంకృషితో పైకొచ్చిన నటుడు నిఖిల్. ఇక నిఖిల్ పని అయిపోయిందనుకునే తరుణంలో ఉవ్వెత్తిన ఎగసిన కెరటంలా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ నిఖిల్ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నిఖిల్ తో సినిమా చెయ్యాలంటే మినిమమ్ టూ ఇయర్స్ వెయిట్ చెయ్యాలసిన పరిస్థితి. అలాగే సినిమా ఇండస్ట్రీ లో ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే నిఖిల్ తాజాగా తన సినిమా విషయంలో జరిగిన ఒక అన్యాయం గురించి చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసాడు.

నిఖిల్ గత సంవత్సరం కార్తికేయ 2 తో లైం లేట్ లోకి వచ్చాడు. హిందీ లో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో నిఖిల్ నుంచి రాబోయే సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. సరిగ్గా అప్పుడు స్పై సినిమా వచ్చింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ గురించి వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. ఆ సినిమా మీద నిఖిల్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ సినిమా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు స్పై సినిమా పరాజయం వెనుక ఉన్న కారణాన్ని నిఖిల్ బయటపెట్టాడు. సినిమా మొత్తం పూర్తి కాలేదని ఇంకో పది రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేసారని అందుకే స్పై చిత్రం ప్లాప్ అయ్యిందని చెప్పాడు. ఆ రకంగా స్పై సినిమా విషయంలో నాకు అన్యాయం జరిగిందని ఇక సినిమా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వనని రాబోయే సినిమాలన్నీ కూడా తన అభిమానులని,ప్రేక్షకులని అలరిస్తాయని నిఖిల్ చెప్పాడు.
నిఖిల్ ప్రస్తుతం స్వయం భూ అనే సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు. చారిత్రక నేపథ్యం లో తెరకెక్కే ఆ సినిమాలోని తన పాత్ర కి సంబంధించి యుద్ధ విద్యలని నేర్చుకోవడం కోసం నిఖిల్ ఇటీవలే వియత్నాం వెళ్లి వచ్చాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.