English | Telugu

నాగబాబు కూతురు నిహారికకి లవ్ లెటర్!

నిహారికా, మెగా డాటర్. మెగా యాంకర్ గా కూడా ఇప్పుడు అందరికీ సుపరిచితురాలు. ఫేస్‌బుక్ లోనూ చాలా పాపులర్ అయిన నిహారికా యాంకర్ గా కూడా మంచి మార్కులు కొట్టేసింది. చిలిపి నవ్వుల నిహారికా స్మైల్ కి పడిపోకుండా ఉండటం కష్టమే. అలా ఎవరు గుండే జార్చుకున్నారో గానీ, ఆమెకు తమ ప్రేమభారాన్ని మెయిల్ రాయభారంగా పంపారట. ఆ మెయిల్ చూసిన నిహారిక సంగతి ఎలా వున్నా వాళ్లమ్మ మాత్రం బాగా కంగారు పడిపోయి, నిహారికను నిలదీసిందట. దానికి ఈ కూల్ అండ్ బబ్లీ గర్ల్, చాలా కూల్ గా అలాంటి దేమి లేదు, మీడియాలో ఇవన్నీ మామూలే అని ఊరుకుందట.. ఈ విషయాన్ని స్వయంగా నిహారికే మీడియాతో పంచుకుంది. ఇంతకీ ఇందులో నిహారికా ఆంతర్యమేమిటో తెలియదు. కానీ దీన్ని బట్టి ఒక విషయం మాత్రం తెలుస్తోంది, సెలబ్రీటికి ఉండాల్సిన మెచ్యూరిటీ మాత్రం నిహారికాకు ఆల్ రెడీ వచ్చేసిందని.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.