English | Telugu
3Dలో రజనీ ఆహ్వాన పత్రిక
Updated : Mar 3, 2014
రజనీకాంత్ ప్రధాన పాత్రలో సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన "కొచ్చడయన్"(విక్రమసింహ తెలుగులో) చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 9న చెన్నై లో భారీ ఎత్తున్న జరగనుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డులను వినూత్న రీతిలో తయారు చేయించారని తెలిసింది. 3D లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఇన్విటేషన్ కార్డులను కూడా 3Dలోనే తయారు చేయించారని, ఇది కేవలం కొంతమంది ముఖ్య అతిధుల కోసమేనని తెలిసింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ చిత్ర తెలుగు ఆడియో విడుదల కార్యక్రమం కూడా జరుపనున్నారు.