English | Telugu
'NBK109' మొదలైంది.. బాలయ్య ఉగ్రరూపంతో నెత్తుటి స్నానమే!
Updated : Nov 8, 2023
అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.
'NBK109' చిత్రీకరణ ఈరోజు(నవంబర్ 8) నుంచి ప్రారంభమైనట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. 'బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్' అంటూ విడుదల చేసిన ఆ పోస్టర్ ఎంతో క్రియేటివ్ గా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. ఈ సినిమాలో రక్తపాతానికి కొదవ లేదని మేకర్స్ తెలిపారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.