English | Telugu

బీఆర్‌ఎస్‌లో చేరిన యాంకర్‌ శ్రీముఖి!

శ్రీముఖి.. ఈ పేరు తెలియని వారుండరు. బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. యాంకర్‌గా పరిచయం కాకముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి శ్రీముఖికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. బుల్లితెరపై రకరకాల షోలు చేస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఏదైనా అనుకోని ఘటన జరిగినపుడు సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది.

తన ప్రోగ్రామ్స్‌ ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి ఒక స్పెషల్‌ వీడియోతో అందరి ముందుకు వచ్చింది. అదేమిటంటే శ్రీముఖి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరింది. అసలు తాను బిఆర్‌ఎస్‌ పార్టీలోకి ఎందుకు చేరాల్సి వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన ఏయే కార్యక్రమాల వల్ల బీఆర్‌ఎస్‌కి ఆకర్షితురాలైంది అనే విషయాలను తన తాజా వీడియోలో తెలియజేసింది.

ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ ‘మాది నిజామాబాద్‌ అని మీ అందరికీ తెలుసు. మా ఊరు పదేళ్ళ క్రితం ఎలా ఉండేది, ఇప్పుడెలా వుంది అనేది గమనిస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ పదేళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు గుర్తించాను. చాలా మార్పులు కూడా జరిగాయి. అవన్నీ మీతో పంచుకోవడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ పాఠశాలను అధునాతనంగా తీర్చిదిద్దారు. వాటర్‌ ట్యాంక్స్‌ను పునరుద్ధరించారు. ఇంకా రోడ్లు, బ్రిడ్జ్‌లు, హాస్పిటల్స్‌, డ్రైనేజ్‌ సిస్టమ్స్‌... అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఒక్క నిజామాబాద్‌లోనే కాదు, తెలంగాణ మొత్తం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, సక్సెస్‌ఫుల్‌గా చేసింది కేసీఆర్‌ ప్రభుత్వం. అందుకే మళ్ళీ ఇదే గవర్నమెంట్‌ వస్తే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు వెయ్యండి’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .