English | Telugu

అనామిక పాటల సందడి

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'అనామిక'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ..."ఇది హిందీలో "కహానీ" పేరుతో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్నీ తెలుగులో రీమేక్ చేయాలంటే కొంచెం భయపడ్డాను. ఎందుకంటే అదే సినిమాను మళ్ళీ తీస్తే జనాలు ఎలా స్పందిస్తారో అనే భయంగా ఉండేది. కానీ ఇదే విషయం గురించి యండమూరి గారిని కలిసిన తర్వాత ఈ కథలో చాలా మార్పులు చేయడం జరిగింది. ఒక థ్రిల్లర్ మూవీ స్టైల్ లో తీయడం జరిగింది. మా చిత్రానికి కీరవాణి గారు సంగీతం అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేటూరి గారి తర్వాత నాకు బాగా నచ్చిన వారంటే అది కేవలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే. ఈ చిత్రంలో నయనతార, వైభవ్ చాలా అధ్బుతంగా నటించారు" అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరధ మహారధులందరూ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంఎం కీరవాణి, సిరివెన్నెల సీతారామశాస్త్రి , రమేష్ ప్రసాద్, నరేష్, వైభవ్, కోదండరామిరెడ్డిలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.