English | Telugu

మొద‌టి భార్య కంటే న‌సీరుద్దీన్ షా ప‌దిహేనేళ్లు చిన్న‌వాడు!

న‌సీరుద్దీన్ షా గురించి తెలీని సినీ ప్రియులు ఉండ‌రు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 1980 నుంచీ ఉన్న ఆయ‌న త‌ను చేసిన సినిమాల‌తో అంత‌ర్జాతీయ ఖ్యాతి గ‌డించారు. ఒక‌వైపు ప్యార‌ల‌ల్ సినిమాలు, మ‌రోవైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూ వెర్స‌టాలిటీ చూపించారు. చేసిన ప్ర‌తి పాత్ర‌కూ త‌న న‌ట‌న‌తో పేరు తెచ్చారు. న‌టుడిగా ఆయ‌న గురించి మ‌న‌లో చాలా మందికి తెలుసు కానీ, ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి తెలిసిన‌వాళ్లు చాలా త‌క్కువ మంది. ఆయ‌న తొలిభార్య మ‌నారా సిక్రీతో పెళ్ల‌య్యే స‌మ‌యానికి ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 20 ఏళ్లే!

షాకింగ్ అనిపించే ఇంకో విష‌యం ఏమంటే పెద్ద‌ల‌కు ఏమాత్రం తెలీకుండా ఆమెను ఆయ‌న వివాహం చేసుకున్నారు. న‌సీరుద్దీన్ త‌మ‌కు చెప్ప‌కుండా పెళ్లి చేసుకున్నాడ‌నే విష‌యం తెలిసిన‌ప్పుడు వాళ్లు చాలా బాధ‌ప‌డ్డారు. వాళ్ల‌ను మ‌రింత‌గా బాధించిన విష‌యం.. న‌సీరుద్దీన్ కంటే మ‌నారా 15 సంవ‌త్స‌రాలు పెద్ద‌ది. పైగా అది ఆమెకు రెండో వివాహం. మొద‌టి భ‌ర్త‌తో ఆమెకు ఓ సంతానం కూడా ఉంది. ఇన్ని షాకింగ్ విష‌యాలు ఆయ‌న మొద‌టి పెళ్లిలో ఉన్నాయి.

అయిన‌ప్ప‌టికీ చాలా కాలం ఆ ఇద్ద‌రూ సంతోష‌క‌ర‌మైన వైవాహిక జీవితాన్ని గ‌డిపారు. ఆ త‌ర్వాత ఎందుక‌నో విడిపోవాల‌ని నిర్ణ‌యించుకొని, విడాకులు తీసుకున్నారు. 1982లో ర‌త్నా పాఠ‌క్ షాను రెండో వివాహం చేసుకున్నారు న‌సీరుద్దీన్‌. ఆ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు. వాటిలో 'ద ప‌ర్‌ఫెక్ట్ మ‌ర్డ‌ర్‌', 'మిర్చి మ‌సాలా' లాంటివి ఉన్నాయి.