English | Telugu
నా మీద కొన్ని మీడియా సంస్థల కుట్ర.. హీరో నాని ఆరోపణ
Updated : Nov 9, 2023
ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగిన నటుడు నాని. తన నాచురల్ స్టార్ అనే బిరుదుకి తగ్గట్టే ఆయన సినిమాలు కూడా అంతే నాచురల్ గా ఉంటాయి. ఆయన వ్యక్తిత్వం కూడా నాచురల్ గానే ఉంటుంది. నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ అందరు ప్లాన్ చేసుకొని మరి నాని సినిమా చూడటానికి థియేటర్లకి క్యూ కడతారు. ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉండే నాని ఇటీవల తన మీద వచ్చిన కొన్ని ఆరోపణలకి చాలా నాచురల్ గా క్లారిఫై ఇచ్చాడు.
హైదరాబాద్ లో ఇండియా టుడే వాళ్ళు ఏర్పాటు చేసిన తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో నాని పాల్గొన్నాడు. ఈ సమావేశంలో నాని మాట్లాడుతూ జాతీయ అవార్డుల్ని ప్రకటించిన సమయంలో నేను మన తెలుగు వాళ్ళకి అవార్డులు వచ్చినందుకు బాధగా ఉన్నాననే ఒక రూమర్ ని కొన్ని మీడియా సంస్థలు క్రియేట్ చేసాయి. జాతీయ అవార్డులు ప్రకటించిన సమయం లో నేను ఏమి అన్నానో మరో సారి మీకు గుర్తుచేస్తున్నాను అని తను ఏమని అన్నాడో మరోసారి చెప్పుకొచ్చాడు.
జాతీయ అవార్డులలో జై భీమ్ సినిమాకి ఎలాంటి అవార్డు దక్కకపోవడంతో నా బాధని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసాను. అలాగే అదే సమయంలో జాతీయ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప మరియు ఉప్పెన టీమ్‌లను కూడా అభినదించాను. అలాగే ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచినందుకు నా సోదరుడు అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియచేసాను. కానీ కొన్ని మీడియా సంస్థలు తెలుగు వాళ్ళకి దక్కిన అవార్డుల విషయంలో నేను సంతోషంగా లేనని వక్రీకరించి రాశాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను .మా చెల్లి ఒక ఘనత సాధించి నా పక్కింటి కజిన్ ఏమి సాధించలేకపోయిందని అనుకుందాం. నేను నా చెల్లి కోసం నా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను బట్ అదే సమయంలో నా కజిన్ గురించి కూడా బాధపడతాను కదా అని చెప్పాడు.
కాకపోతే జై భీమ్ లాంటి అత్యుత్తమ చిత్రానికి జాతీయ స్థాయిలో ఒక అవార్డు అయినా వచ్చి ఉంటే అలాంటి సినిమాలుని మరింత మంది చెయ్యడానికి ప్రోత్సాహకరంగా ఉండేది అని చెప్పాడు. నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు. మృణాల్ ఠాకూర్ నాని సరసన హీరోయిన్ గాచేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8 న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది.