English | Telugu

ఇదే నా మొట్టమొదటి పుట్టిన రోజంటున్న సూపర్ స్టార్ మహేష్ సోదరి 

సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న ఐదుగురి సంతానంలో ఒకరు మంజుల ఘట్టమనేని. యుక్త వయసులో ఉన్నప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణించాలని మంజుల భావించింది. కానీ కృష్ణ గారి అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మంజుల హీరోయిన్ ప్రయత్నాల్ని మానుకుంది. కానీ నటన మీద ఉన్న మక్కువతో చాలా సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద మంజుల నటించడం ప్రారంభించింది. కృష్ణ గారి అమ్మాయి మంజుల కూడా మంచి నటి అనే గుర్తింపుని కూడా ప్రేక్షకుల్లో సంపాదించింది. తాజాగా మంజుల ఎక్స్ వేదికగా తన ట్విట్టర్ లో ఎమోషనల్ గా చేసిన ఒక ట్వీట్ అండ్ ఒక పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ రోజు మంజుల తన పుట్టిన రోజుని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ లో మా నాన్న లేకుండా జరుపుకుంటున్న మొట్ట మొదటి పుట్టిన రోజు అని ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ చేసింది. అలాగే గత సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ దగ్గరుండి మరి మంజుల చేత కేక్ కోయించడానికి ఏర్పాట్లు చేస్తున్న పిక్ ని కూడా మంజుల షేర్ చేసింది. ఆ పిక్ లో మహేష్ బాబు, నమ్రత ,మంజుల భర్త సంజయ్ ,కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు లు కూడా ఉన్నారు. ఈ పిక్ చూసిన సూపర్ స్టార్ అభిమానులు తమ అభిమాన కధానాయకుడు కృష్ణ కి తన బిడ్డలంటే ఎంత ప్రేమో అని అనుకుంటున్నారు.

మంజుల చాలా తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలనే పోషించింది. ఆరంజ్ సినిమాలో రామ్ చరణ్ అక్క క్యారక్టర్ లోని ఆమె నటన ప్రేక్షకులకి నేటికీ గుర్తుండిపోతుంది. మంజుల రీసెంట్ గా వచ్చిన మంత్ ఆఫ్ మధు సినిమాలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసల్నిసైతం అందుకుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.