English | Telugu

"ఖాళీగా ఉండలేను"- నాగ్

యువసామ్రాట్ , కింగ్ అక్కినేని నాగార్జున తెలుగు వన్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ "నేను ఖాళీగా ఉండలేను" అని అన్నారు. వివరాల్లోకి వెళితే నాగార్జున తాను నటించిన "రాజన్న" చిత్రం ప్రమోషన్ లో భాగంగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలుగు వన్ అడిగిన "యువ హీరోలు మహేష్ బాబు, జూనియర్ యన్ టి ఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ వంటి వారు యేడాదికో, రెండేళ్ళకో ఒక సినిమా చేసేవారు. కానీ మీరు సినిమాల్లో నటిస్తున్న తీరు చూసి వాళ్ళు కూడా యేడాదికి రెండు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇంత వేగంగా సినిమాల్లో మీరు నటించటానికి కారణం. అలాగే విశ్రాంతి లేకుండా ఇలా నటించటానికి మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి...?" అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగార్జున ఇలా సమాధానం చెప్పారు. "నాకు ఖాళీగా ఉండాలంటే చిరాకండీ. రోజుకు ముప్పై గంటలు సమయముంటే బాగుండనిపిస్తుంది. ఇంకా ఎక్కువ సేపు పనిచెయ్యవచ్చుకదా..." అని "డమరుకం" సినిమాలో నటించటానికి వెళ్ళారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.