English | Telugu
దుర్గ అంటున్న చైతు
Updated : Feb 6, 2014
నాగచైతన్య హీరోగా మరో చిత్రం ప్రారంభం అయ్యింది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు "దుర్గ" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా అన్నపూర్ణ స్టుడియోలో ప్రారంభం అయ్యింది. చైతన్య సరసన మొదటిసారిగా హన్సిక జతకడుతుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈనెల 24 నుండి ప్రారంభం కానుంది. రంజాన్ కానుకగా విడుదల చేయనున్నారు.