English | Telugu
"ఆటోనగర్ సూర్య" కోసం జైల్లో నాగచైతన్య
Updated : Dec 22, 2011
"ఆటోనగర్ సూర్య" కోసం జైల్లో నాగచైతన్య ఉన్నారట. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా, దేవకట్టా దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఆటోనగర్ సూర్య". ప్రస్తుతం ఈ "ఆటోనగర్ సూర్య" చిత్రం హైదరాబాద్ లోని చంచల్ గూడా జైల్లో జరుగుతూంది. చంచల్ గూడా జైల్లో నాగచైతన్య ఖైదీ నంబర్ 203 జైల్ డ్రెస్ లో "ఆటోనగర్ సూర్య" చిత్రంలో పాల్గొంటున్నారు.
ఈ "ఆటోనగర్ సూర్య" చిత్ర దర్శకుడు దేవకట్టా గతంలో "వెన్నెల, ప్రస్థానం" వంటి విభిన్నచిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాధించారు. దర్శకుడిగా ఈ "ఆటోనగర్ సూర్య" చిత్రం అతనికి హేట్రిక్ చిత్రం కానుంది. నాగచైతన్య హీరోగా నటించిన గత చిత్రం"బెజవాడ" చిత్రం అనూహ్యంగా పరాజయం పాలయ్యింది. కానీ నాగచైతన్య, సమంత కలసి గతంలో నటించిన "ఏమాయచేశావే" చిత్రం ఘనవిజయం సాధించింది.