English | Telugu

'ముకుంద' సందడి మొదలైంది

మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా వస్తున్న హీరో వరుణ్‌ తేజ్‌ 'ముకుంద' సందడి మొదలైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు మెగా హీరోల సమక్షంలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన సాంగ్ టీజర్‌ ఒకటి రిలీజ్‌ చేసారు. ఈ టీజర్ లో వరుణ్‌ తేజ తన డాన్సులతో పర్వాలేదనిపించాడు. లుక్స్ లో మాత్రం మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకోగల ఫీచర్స్‌ ఉన్నాయి. లేడీస్‌ ఫాలోయింగ్‌ ఇతగాడికి త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమా ఆడియో టీజర్ లు చూస్తుంటే సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ మంచి పాటలు అందించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సంస్థవారు సుమారు 45 లక్షలకు సొంతం చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.