English | Telugu

వ‌ర్మ ఆత్మ‌హ‌త్య చేసుకొంటాడ‌ట‌

జీవితాన్ని ఎంత‌లా అనుభ‌వించాలో వ‌ర్మ‌కి తెలిసినంత‌గా మ‌రొక‌రికి తెలీదేమో..? హిట్టూ, ఫ్లాపూ ఇవేం ప‌ట్టించుకోడు. రేప‌టి గురించి ఆలోచించ‌డు. ఈ రోజు హ్యాపీగా బ‌తికేస్తే చాల‌నుకొంటాడు. దాని కోసం ఏమైనాచేస్తాడు. అయితే మ‌రణం ముగింట వ‌ర్మ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ్‌..?? కాసేప‌ట్లో చ‌నిపోతాన‌ని తెలిస్తే ఏ విధంగా పీల్ అవుతాడు? అనారోగ్యంతో మంచంపై ప‌డితే ఆయ‌న ఫీలింగ్స్ ఏమిటి?? వీటిని క్యారీ చేసింది ఓ ఛాన‌ల్‌. ''మంచంపై ప‌డి మ‌రొక‌రితో సేవ చేయించుకొనే సీన్‌ని నేను ఊహించ‌లేక‌పోతున్నా. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే.. ఆత్మ‌హ‌త్య చేసుకొంటా. నా మ‌ర‌ణం ఎప్పుడో తెలిస్తే.. నేనంటే ఎవ్వ‌రూ గుర్తుప‌ట్ట‌ని ఏకాంత ప్ర‌దేశానికి వెళ్లిపోతా. నా శ‌వాన్ని కూడా ఎవ‌రికీ చూపించ‌ను'' అంటూ హార్ట్ ట‌చింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. అవ‌కాశం వ‌స్తే డెత్‌ని కూడా బ‌ర్త్ డేగా సెల‌బ్రేట్ చేసుకొంటాడ‌ట‌. వ‌ర్మ‌.. ఏదైనా చేయ‌గ‌ల‌డు. హి ఈజ్ జీనియ‌స్‌!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.