English | Telugu

వరుణ్ తేజ 'ముకుంద' ఆడియో డేట్

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు 'వరుణ్ తేజ' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద'గా టాలీవుడ్ కి పరిచయంకాబోతున్నాడు. తాజా సమాచార౦ ప్రకారం ఈ సినిమా ఆడియోను నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. మూడు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందట. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుతున్నాయి. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.