English | Telugu

ముగ్గురు సినిమా షూటింగ్ ప్రోగ్రెస్

"ముగ్గురు" సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ గురించి తెలియజేయటానికి రామానాయుడు స్టుడియోలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ హీరోలుగా, శ్రద్ధా దాస్, సౌమ్య హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో,మూవీ మొగల్, డాక్టర్ డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం "ముగ్గురు". ఈ "ముగ్గురు" సినిమాకి "మహామాయగాళ్ళు" అన్న క్యాప్షన్ ని ఏర్పాటు చేశారు. సత్యానంద్, నివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా, కోటి సంగీతాన్ని, జవహర్ రెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ఈ సినిమా మలేసియాలో 20 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఈ స్కెడ్యూల్లో మూడు పాటలనూ, కొన్ని ముఖ్యమైన సీన్లనూ అక్కడ చిత్రీకరించారు. తదుపరి జూన్ 25 నుండి రామానాయుడిగారి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని కారంచేడులో మరో స్కెడ్యూల్ జరుపనున్నారు. పూర్తి స్థాయి కామెడీతో రానున్న ఈ సినిమా ఆడియోని, ఈ సినిమాని జూలైలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.