English | Telugu
ధోనీ సిల్వర్‌స్క్రీన్ డెబ్యూ!
Updated : Jul 25, 2023
సినిమానూ, పాలిటిక్స్ నూ విడదీసి, సెపరేట్‌గా చూడలేం అంటారు. కానీ, సినిమానూ, క్రికెట్‌నూ అసలు విడదీసి చూడలేం. అంతటి అవినాభావ సంబంధం ఉన్న ఫీల్డ్స్ అవి. ముఖ్యంగా అడ్వర్‌టైజ్‌మెంట్ ఇండస్ట్రీలో స్క్రీన్ మీద క్రికెట్ స్టార్స్ హీరోలుగా మెప్పిస్తుంటారు. ఆల్రెడీ యాడ్ ఇండస్ట్రీదాకా వచ్చేసిన వారు మరొక అడుగు ముందుకేసి సిల్వర్ స్క్రీన్ మీద కూడా సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద తామేంటో ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయం కొందరిదైతే, సరదాగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇద్దామనుకుని ఓ సారి ట్రై చేసే వారు కొందరు. వీటిలో ధోని ఏ కేటగిరీకి ఫిక్స్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
హరీష్ కల్యాణ్ హీరోగా రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎల్‌జీఎం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌ధోని, ఆయన భార్య సాక్షి ఈ సినిమాను నిర్మించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఇండస్ట్రీలో ధోనికి ఫస్ట్ వెంచర్ ఇది. ఇప్పటిదాకా, ధోనీ, అతని భార్య నిర్మాతలుగానే ప్రమోట్ అయింది ఎల్‌జీఎం. కానీ ఇప్పుడు అంతకు మించిన న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ధోనీ నటిస్తున్నారనే వార్త ఆయన ఫ్యాన్స్ కి ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఎల్‌జీఎంలో ధోనీ ఓ ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారనేది టాక్. ఇంతకు ముందు పలు యాడ్స్ లో నటించారు ధోనీ. కెమెరాను ఫేస్ చేయడం ఆయనకేం కొత్తకాదు. షూటింగ్ ఎట్మాస్పియర్ ఎప్పటినుంచో అలవాటు ఉంది. అందుకే, డైరక్టర్ అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశారట. దీనికి సంబంధించి, టీమ్ నుంచి ఇంకా అఫిషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియ, యోగిబాబు, ఆర్‌జె విజయ్, శ్రీనాథ్, వీటీవీ గణేష్, వినోదిని, దీపా శంకర్, విక్కల్స్ విక్రమ్, విక్కల్స్ హరి తదితరులు నటించారు.