English | Telugu
బరువు తగ్గిన అజిత్... విడాముయర్చి కోసం!
Updated : Jul 25, 2023
విడాముయర్చి అంటే పట్టుదల అని అర్థం. తన సినిమా టైటిల్‌కి ఎగ్జాంపుల్‌గా మారారు అజిత్. పట్టుదలతో ఆయన బరువు తగ్గారు. త్వరలోనే విడాముయర్చి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారు అజిత్. ఆ రెండు పాత్రల్లో ఒకదానికోసమే ఆయన బరువు తగ్గారు. ఆయన నటిస్తున్న 62వ సినిమా ఇది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారు.
డైరక్టర్ మగిళ్ తిరుమేని కోరిక మేరకు అజిత్ బరువు తగ్గారట. స్టోరీ, స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే అన్నీ సిద్ధమయ్యాయి.వచ్చేనెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మొత్తం సినిమాను మూడు షెడ్యూళ్లలో పూర్తి చేసేలా ప్లానింగ్ ఇచ్చారట మగిళ్ తిరుమేని. ఫస్ట్ రెండు షెడ్యూళ్లలోనూ అజిత్ కుమార్ మీద సన్నివేశాలను చిత్రీకరిస్తారట. మూడో షెడ్యూల్లో మిగిలిన వారిని పిలిపించి షూటింగ్ చేస్తారట. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అజిత్ వరల్డ్ వైడ్ బైక్ టూర్‌కి వెళ్తారు. రైడ్ ఫర్ మ్యూచువల్ రెస్పెక్ట్ పేరుతో ఆయన ఈ రైడ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో రైడ్ ఉంటుంది. అప్పటికి విడాముయర్చి పనులన్నీ పూర్తయిపోతాయి.
అజిత్ కుమార్ బైక్ రైడ్‌ని నెట్‌ఫ్లిక్స్ లో సీరీస్‌గా చేస్తున్నారు. నిరవ్ షా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న విడాముయర్చి సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నిరవ్ షా కెమెరామేన్‌గా పనిచేస్తున్నారు. 2023 సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అజిత్. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరి ఉంటే, ఈ పాటికి విఘ్నేష్ శివన్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయాల్సింది. అది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉండాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా అది జరగలేదు.