English | Telugu

ఎమ్మెల్యేగా బాలయ్యకు మొదటి పుట్టినరోజు



‘చెప్పండి వాడికి.. సెంటరైనా, స్టేటైనా.. పొజిషనైనా, అపొజిషనైనా.. పవరైనా, పొగరైనా.. నేను దిగనంతవరకే.. ఒన్స్‌ ఐ స్టెప్‌ ఇన్‌..
హిస్టరీ రిపీట్స్‌’. ‘లెజెండ్‌’ సినిమాలో అత్యంత రౌద్రంగా నందమూరి నటసింహం బాలకృష్ణ పలికిన సంభాషణల్లో ఇది కూడా ఒకటి. అయితే.. ఆయన తాను పలికిన సంభషణల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ద్వారా నిరూపించారు. భారీ మెజారిటీతో హందూపురం ఎమ్మెల్యేగా గెలిచి.. ‘హిస్టరీ రిపీట్‌’ చేశారు. ఈనెల జూన్‌ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నందమూరి అభిమానులు సన్నాహాలు చేసుకొంటున్నారు. నాచారం, రామకృష్ణ స్టూడియోస్‌లో నందమూరి అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహింపబడనున్న ఈ పుట్టినరోజు వేడుకలకు నంబూరి సతీష్‌, జి.ఎల్‌.శ్రీధర్‌, బి.బి.జి.తిలక్‌లు కార్య నిర్వహకులుగా వ్యవహరిస్తారు. తమ నందమూరి వంశ కథానాయకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ నాచారం తరళిపోనున్నారు. ఈ సందర్భంగా వారు రక్తదాన శిబిరాలు సైతం నిర్వహించనున్నారు!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.