English | Telugu

శెట్టి అండ్ శెట్టి.. జస్ట్ 'హిట్' కాదండోయ్ 'బ్లాక్ బస్టర్' అంతే.. 12 రోజుల కలెక్షన్స్ ఇవిగో!

కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ రేంజ్ కి వచ్చేసింది. వీక్ డేస్ లోనూ చెప్పుకోదగ్గ వసూళ్ళు చూస్తూ వచ్చిన ఈ మూవీ.. సెకండ్ వీకెండ్, సోమవారం (వినాయక చవితి సెలవు)ని సద్వినియోగం చేసుకుని హిట్ స్టేటస్ నుంచి బ్లాక్ బస్టర్ స్టేటస్ కి చేరుకుంది. రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన శెట్టి అండ్ శెట్టి.. 12 రోజుల్లో రూ. 21. 33 కోట్ల షేర్ రాబట్టింది. అంటే.. ఓవరాల్ గా రూ. 7.83 కోట్ల లాభం చూసిందన్నమాట. మరి.. ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెంత లాభాలు ఆర్జిస్తుందో చూడాలి.


'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 12 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 6.58 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 1.11 కోట్ల షేర్
ఆంధ్రా: రూ. 4.49 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.12.18 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.65 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.7.50 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల కలెక్షన్స్ : రూ.21.33 కోట్ల షేర్ (రూ. 41.20 కోట్ల గ్రాస్)

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.