English | Telugu

తన సొంత ప్రాంతమైన గోదావరి గడ్డ  విశిష్టితని చెప్తున్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి..మూడు దశాబ్దాల కి పైగా తెలుగు సినిమా రంగాన్ని తనదైన నటనతో శాసిస్తున్న మేరునగధీరుడు.ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో ప్రేక్షకుల్లో ఎంతటి పండగ వాతావరణం ఉంటుందో ఆయన కొత్త సినిమా ప్రారంభమయితే కూడా అంతే పండుగ వాతావరం ఉంటుంది. తాజాగా ఆయన బింబి సార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం లో ఒక సినిమాని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధిచిన ఒక క్రేజీ న్యూస్ మెగాస్టార్ అభిమానుల్లో జోష్ ని నింపుతుంది.

చిరంజీవి కెరీర్లో 156 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు .దొరబాబు అనే క్యారక్టర్ లో కంప్లీట్ గా గోదావరి యాసలో తన డైలాగులని చెప్పబోతున్నాడు.పైగా చిరంజీవి పుట్టి పెరిగిన ప్రాంతం గోదావరి ఏరియానే కాబట్టి గోదావరి యాసలో మాట్లాడటం చిరుకి కొట్టిన పిండి. ఆయన గతంలో కూడా చాలా సినిమాల్లో గోదావరి యాసలోమాట్లాడి తన అభిమానులని ఎంతగానో అలరించాడు.పైగా గోదావరి జిల్లాల్లో చిరుకి అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ యాసలో ఆయన సిల్వర్ స్క్రీన్ పై మాట్లాడుతుంటే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. పైగా గోదావరి ప్రాంత యాసకి ఉన్న విశిష్టిత కూడా చిరంజీవి లాంటి గొప్ప నటుడు ద్వారా విశ్వవ్యాప్తమవుతుంది.

చిరంజీవి పోషించే దొరబాబు క్యారెక్టర్ ని దర్శకుడు వశిష్ఠ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దితున్నాడు. కథలో కూడా ఎవరు ఊహించని ట్విస్ట్ లు చాలా ఉంటాయనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చిరంజీవి నట జీవితంతో పాటు తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే గొప్ప చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతనాన్ని సమకూరుస్తుండగా సాయిమాధవ్ బుర్రా డైలాగులని అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.