English | Telugu

ఆ వెర్షన్ లో సలార్ విడుదల లేదు.. ట్విటర్ ద్వారా వెల్లడించిన సంస్థ 

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ మూవీకి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఇంక కేవలం ఎనిమిది రోజుల్లోనే సలార్ ప్రపంచ వ్యాప్తంగా లాండ్ అవ్వనుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సలార్ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని తమ సెల్ ఫోన్ ని 24 గంటలు తమ చేతిలోనే ఉంచుకుంటున్నారు. థియేటర్స్ ఓనర్స్ కూడా సలార్ కోసం తమ థియేటర్స్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కానీ ఇప్పుడు సలార్ ఒక ఏరియాలో ముందు అనుకున్న దాని ప్రకారం రిలీజ్ అవ్వకపోవడంతో అక్కడ ఉన్న ప్రభాస్ అభిమానులు డల్ అవుతున్నారు.

యూఎస్ లో సలార్ ని ఐమాక్స్ వెర్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని ఆ సినిమా యుఎస్ హక్కులు కొన్న ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది. కానీ ఇప్పుడు సలార్ ఐమాక్స్ వెరైన్ లో రిలీజ్ అవ్వడంలేదు. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధిలు తమ ట్విటర్ ద్వారా తెలిపేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్క సారిగా షాక్ కి గురయ్యారు. కేవలం ఎక్స్ డి అండ్ పిఎల్ఎఫ్ ఫార్మాట్స్ లో మాత్రమే సలార్ రిలీజ్ అవుతుందని ఐమాక్స్ వెర్షన్ రిలీజ్ ఉంటుందనే ఆనందంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ చివరి నిమిషంలో డిజప్పాయింట్ కాకూడదని ముందుగానే చెప్తున్నామని కూడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలిపింది.