English | Telugu

మెగా వర్సెస్ అల్లు.. బన్నీ, చరణ్ మధ్య దూరం బయటపడింది!


తనకంటూ ఓన్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కొంతకాలంగా మెగా బ్రాండ్ కి, మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలిచినప్పుడు అందులో తన కుటుంబానికి చెందిన మెగా హీరో రామ్ చరణ్ కూడా ఉన్నప్పటికీ, తను బావ అని పిలుచుకునే నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగు ప్రైడ్ అని ప్రత్యేకంగా సంబోధించినప్పుడే ఈ ప్రచారం బలపడింది. ఇక ఇప్పుడు నేషనల్ అవార్డుల పుణ్యమా అని ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. బన్నీ అవార్డు గెలుచుకోవడం పట్ల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శుభాకాంక్షలు బావ అంటూ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేయగా.. నీ జెన్యూన్ విషెస్ కి థాంక్యూ బావ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. అయితే చరణ్ మాత్రం బన్నీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపకుండా, మిగతా విజేతలతో కలిపి విష్ చేశాడు. బన్నీ కూడా అందుకు తగ్గట్టుగానే థాంక్యూ అంటూ ఏదో బయటవారికి రిప్లై ఇచ్చినట్లుగా ఇచ్చాడు. ఇక తనని ప్రత్యేకంగా విష్ చేస్తూ మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. థాంక్యూ సో మచ్ మై స్వీటెస్ట్ జెన్యూన్ కజిన్ అని రిప్లై ఇచ్చాడు.

బన్నీని ప్రత్యేకంగా అభినందిస్తూ చరణ్ ట్వీట్ చేయకపోవడం.. బన్నీ కూడా థాంక్యూ అంటూ ఫార్మాలిటీకి రిప్లై ఇచ్చి, సాయి ధరమ్ తేజ్ ట్వీట్ కి జెన్యూన్ కజిన్ అని రిప్లై ఇవ్వడం చూస్తుంటే.. చరణ్ - బన్నీ మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా? నిజమైతే ఆ దూరం ఏర్పడటానికి కారణం ఏంటి? అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.