English | Telugu

'మేరీకోమ్' అఫిషియల్ టీజర్ విడుదల


లగాన్ సినిమా మొదలుకొని బాలీవుడ్ లో ఆటలను ముఖ్యాంశంగా చేసుకుని చక్కటి చిత్రాలు రూపొందిస్తున్నారు. ఆ కోవలో వచ్చిని ఛక్ దే, బాగా మిల్కా బాగ్ చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. నిర్మాణ పరంగా చక్కటి విలువలతో రూపొందిన ఈ సినిమాలు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ పొందగలిగాయి. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకోగలిగాయి.


ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న మరో చిత్రం మేరీకోమ్. ఒలింపిక్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవితకథ ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అఫిషియల్ ట్రెయిలర్ విడుదలైంది.
జూలై 18 ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈ సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ఆమె అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. చిత్రంలో ఆమె పాత్ర ఎంత సీరియస్ గా వుండబోతుందో ఈ టీజర్ చూసి అంచనాకి రావచ్చు. ట్రెయిలర్ హాలీవుడ్ స్థాయికి తక్కువ కాకుండా వుండటం విశేషం. ఈ ట్రెయిలర్ సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం పై అంచనాలు మరింత పెంచేసింది అనటంలో సందేహం లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.