English | Telugu

రూ. 50 కోట్ల క్లబ్ లో 'మార్క్ ఆంటోని'.. నాలుగు రోజుల్లో విశాల్ కిదే బిగ్గెస్ట్..!

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'మార్క్ ఆంటోని' మూవీ.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. విశాల్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా ఈ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ తో పాటు సోమవారం (వినాయక చవితి) సెలవు దినం కూడా 'మార్క్ ఆంటోని'కి కలెక్షన్ల పరంగా కలిసొచ్చిందనే చెప్పాలి.

వరల్డ్ వైడ్ గా.. 'మార్క్ ఆంటోని' తొలి నాలుగు రోజుల్లో రూ. 52. 05 కోట్ల గ్రాస్ ఆర్జించింది. ఏదేమైనా.. వీక్ డేస్ లో పెర్ఫార్మెన్స్ ని బట్టే.. 'మార్క్ ఆంటోని' రేంజ్ పై క్లారిటీ వస్తుంది. కాగా ఎస్. జె. సూర్య కామెడీ, సిల్క్ స్మిత ఎపిసోడ్.. 'మార్క్ ఆంటోని'కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

ఏరియాల వారిగా 'మార్క్ ఆంటోని' 4 రోజుల కలెక్షన్స్:

తమిళనాడు: రూ. 32.40 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు: రూ. 5.20 కోట్ల గ్రాస్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 4.85 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ. 9.60 కోట్ల గ్రాస్

వరల్డ్ వైడ్ 4 రోజుల కలెక్షన్స్: రూ. 52. 05 కోట్ల గ్రాస్ (రూ. 25. 50 కోట్ల షేర్)

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.