English | Telugu
'మంగళవారం' ఫస్ట్ డే కలెక్షన్స్.. వచ్చింది కొంత, రావాల్సింది కొండంత!
Updated : Nov 18, 2023
పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టీరియస్ థ్రిల్లర్ 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్, అజయ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ మూవీలో పాయల్ బోల్డ్ పాత్ర పోషించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 'మంగళవారం' నిన్న(నవంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ఉన్న అంచనాలు, పాజిటివ్ టాక్ కి తగ్గట్టుగానే మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.
వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన మంగళవారం.. రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజు నైజాం(తెలంగాణ)లో రూ.75 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.89 లక్షల షేర్, సీడెడ్ లో రూ.38 లక్షల షేర్ రాబట్టిన ఈ మూవీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.2.02 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.28 లక్షల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.2.30 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.10.70 కోట్ల షేర్ దాకా రాబట్టాల్సి ఉంది. కొండంత టార్గెట్ ఉన్నప్పటికీ.. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పైగా ప్రస్తుతం ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో 'మంగళవారం' ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంగళవారం మొదటి రోజు కలెక్షన్స్:
నైజాం: రూ.75 లక్షల షేర్
ఆంధ్రా: రూ.89 లక్షల షేర్
సీడెడ్: రూ.38 లక్షల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్: రూ.2.02 కోట్ల షేర్
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ.28 లక్షల షేర్
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్: రూ.2.30 కోట్ల షేర్