English | Telugu

ఆధ్యాత్మికత అంటే ఈ సినిమా చూడాలి అంటున్నారు!

తెలుగు,తమిళం తో పోల్చుకుంటే మలయాళం మార్కెట్ చాలా తక్కువ. అక్కడ పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ అయినా మోహన్‌లాల్ మమ్ముట్టి వంటి వారు కూడా 20 నుంచి 30 కోట్ల లోపు బడ్జెట్ తో సినిమాలు తీస్తారు. ఇక చిన్న సినిమాలు అయితే కంటెంట్ బేస్డ్ గా వస్తాయి. వాటికి రెండు మూడు కోట్లు బ‌డ్జెట్ మాత్ర‌మే కేటాయిస్తారు. ఆ సినిమాలు హిట్ అయితే కనీసం 20 నుంచి 30 కోట్లు వసూలు చేస్తాయి. ఇక సినిమా కంటెంట్ బాగుంటే ఇతర భాషల్లో రీమేక్ హక్కులు డబ్బింగ్ ద్వారా మరింత ఆదాయం సమకూరుతుంది. కేవలం మన్యం పులి వంటి చిత్రాలకు మాత్రమే వారు 30 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తారు. ఇక విషయానికి వస్తే తాజాగా మలయాళంలో మాలికాపురం అనే చిత్రం రూపొందింది. అతి తక్కువ బడ్జెట్ తో ఉన్ని ముకుందన్ అయ్యప్ప స్వామి నేపథ్యంలో స్పిర్చువల్ గా ఈ మూవీ తెర‌కెక్కింది మాలికాపురంలో ఉన్ని ముకుందన్ అన్నీ తానై నిలిచారు.

కంటెంట్ బాగా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమా మలయాళంలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకొని పోతోంది. కేరళలో 37.5 కోట్లు కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్ల వరకు వచ్చాయి. ఓవర్సీస్ లో 10 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా 50 కోట్ల క్లబ్బులో ఈ చిత్రం చేరింది. ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ హిట్ మలయాళ చిత్రంగా ఇది శుభారంభం అందించింది. ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయినా కూడా ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం వలన ప్రజల్లోకి రీచ్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం ప్రమోషన్ పరంగా బాగా హైపురావడంతో ఈ సినిమా ఘన విజయం సాధించింది ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు ఈ స్థాయిలో ఘనవిజయం సాధిస్తుంటే అది నిజమైన సినీ అభిమానులకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలా మాలికాపురం చిత్రం అందరికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని చెప్పాలి.