English | Telugu
చైర్మన్ పదవికి నట్టికుమార్ రాజీనామా
Updated : Nov 29, 2011
ఈ మధ్య ఏ చిన్న వివాదమున్నా ఆ అంటే ఊ అంటే మీడియా ముందుకొస్తున్న చిన్న నిర్మాత నట్టికుమార్. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యుడైన నట్టికుమార్ నిర్మాతల మండలి చైర్మన్ గా ఉన్నారు. ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. కారణం ఏమిటని మీడియా అడగ్గా కొందరు పెద్ద నిర్మాతల కారణంగా మనస్తాపానికి గురై తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని నట్టికుమార్ అన్నారు. చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరక్కుండా, వారి సినిమాలు విడుదల కాకుండా తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు బడా నిర్మాతలు వ్యవహరిస్తున్నారనీ ఇది సమంజసం కాదనీ, చిన్న సినిమాలు బతికినప్పుడే సినీపరిశ్రమ బాగుంటుందనీ ఆయన అన్నారు.