English | Telugu

ఫింగర్ వాడమంటున్న హాట్ బ్యూటీ

ఎన్నికల్లో ఓటు వేయమని, అది మన బాధ్యత అని రాష్ట్ర రాజకీయ పార్టీ కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ఓటు విలువ ఏంటో, దానివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం ఉందొ చెపుతూ ఓటు వేయాలని సూచిస్తారు. కానీ ఇదంతా మంచి మంచి మాటలతో పధ్ధతిగా చెబితే జనాలకు నచ్చి ఓటు వేయడానికి సిద్ధం అవుతారు. కానీ కొంచెం రొమాంటిక్ గా, సెక్సీ చూపులతో, ద్వందార్ధాలు వచ్చే విధంగా చెప్తే ఎలా ఉంటుంది? ఓటు వేయడం మానేసి ఇంకేదో ఆలోచనలు వచ్చేస్తుంటాయి జనాలకు.

ఇంతకీ అలా ఎవరు చేసారని అనుకుంటున్నారా? ఆవిడ మరెవరో కాదు. నటి మధుశాలిని. దేశంలో ఎన్నికల హడావిడి ఎక్కువ అవడంతో రాజకీయ నాయకులే కాకుండా సినీ పరిశ్రమకు చెందినా వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా "ఓటు మన జన్మ హక్కు" అంటూ ప్రచారం చేస్తున్నారు.

అందరూ చేస్తున్నారు నేనెందుకు ఓటు గురించి ప్రచారం చేయకూడదని భావించిన మధుశాలిని కొంచెం కొత్త విధానంతో ప్రచారం చేసింది. ఇంతకీ మధుశాలిని ఏం చేసిందంటే.... ఒక సోఫాలో పడుకొని, చేతిలో ఒక పెన్సిల్ పట్టుకొని, దానిని తన నోట్లో పెట్టుకుంటూ తీస్తూ... ద్వందార్ధాలు వచ్చే విధంగా మాట్లాడుతూ, హాట్ హాట్ గా సెక్సీ‌పోజులో పెన్సిల్ నోట్లో పెట్టుకొని ఫింగర్‌ను కరెక్ట్‌గా యూజ్ చేయండి అంటూ కొంచెం హస్కీ వాయిస్ తో ఏదేదో మాట్లాడేసింది. కానీ అదంతా ఓటు కోసమే అని అనుకోవడం మన పొరపాటు అవుతుంది. కానీ చివర్లో ఒక 5 సెకన్లు సీరియస్ గా "ఓటు వేయడం మన బాధ్యత" అని ముగించింది.

ఈ అమ్మడు చేసిన ఈ సెక్సీ ఓటు ప్రచారం జనాలకు చేరడం అనే మాట పక్కన పెడితే.... ఈ అమ్మడు కానీ ఇదే వీడియోతో జనాల ముందుకు వెళితే చీపురు కట్టలు తిరగేయడం మాత్రం ఖచ్చితం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.