English | Telugu

అనామిక యూసర్ రివ్యూ

హిందీలో సూపర్ హిట్టయిన 'కహానీ' తెలుగులో 'అనామిక'గా వస్తుంది. అందులోను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అనగానే మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి చూస్తారు. అలా 'కహానీ' మీద అభిమానంతో లేదా శేఖర్ కమ్ముల మీద అభిమానంతోనో ఈ సినిమా చూసే నాలాంటి ప్రేక్షకులు కొంచెం నిరాశపడక తప్పదు. కథ, కథనంలో కహనీకి అనామికకి చాలా తేడా ఉంది. ఇది రీమేక్ కాదు. కేవలం అందులోని ఒక అంశాన్ని తీసుకొని నా స్టైల్ లో అనామికను రూపొందించాను అని శేఖర్ కమ్ముల చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చూస్తే ఓ మంచి సినిమా చూసిన అనుభూతి మిగుల్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కదలకుండా సీట్ లో కూర్చుని సినిమా చూడటానికి చాలా సహనం కావాలి. సెకండ్ హాఫ్ కొన్ని ట్విస్టులతో పరవాలేదనిపిస్తుంది. కానీ సినిమాలో కొన్నింటికి లాజిక్ ఉండదు. వాటికోసం ఆలోచిస్తే 'ఇదేంటి! శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడు ఇలాంటి పొరపాట్లు చేసాడే' అని అనిపిస్తుంది.

ఇక కథలోకొస్తే....

ఒకవైపు హైదరాబాదు పీపుల్స్ ప్లాజాలో బాంబు పెళ్లుల్లు జరుగుతూ ఉంటాయి. వీటికి మిలింద్ అంజీ అనే వ్యక్తి కారణం. ఈ బాంబు పేలుళ్ళకి బాధ్యత వహిస్తూ హోం మినిస్టర్ రాజీనామా చేస్తాడు. ఆయన స్థానంలో వచ్చిన కొత్త హోం మినిస్టర్ ఆదికేశవయ్య(నరేష్) ఈ కేసుపై విచారణ వద్దని యాంటీ టెర్రరిస్ట్ సెల్ అధికారి ఖాన్ (పశుపతి)ని ఆదేశిస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు కనిపించకుండాపోయిన తన భర్త కోసం వెతుక్కుంటూ హైదరాబాదుకు వస్తుంది ఎన్నారై అనామిక(నయనతార). పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చినాఅక్కడి పోలీసుల నుండి ఎలాంటి సహాయం దొరకదు. కానీ ఎస్.ఐ పార్థసారథి (వైభవ్) మాత్రం అనామికకు అవసరమైన సహాయం చేస్తాడు. కానీ ఆమె భర్తను వెతకడానికి అనామికకు సహాయం చేసే ఒక్కొక్కరు అనుకోని రీతిలో చనిపోతుంటారు. వాళ్ళు ఎందుకు అలా చనిపోతారు? వాళ్ళని ఎవరు, ఎందుకు చంపుతున్నారు? ఈ బాంబు పేలుళ్లకు, అనామికకు ఉన్న సంభంధం ఏమిటి? మరి చివరకు అజయ్ శాస్త్రి దొరికాడా లేదా అనేది కథ.

సాంకేతిక నిపుణులు, సంగీతం వీటన్నిటి గురించి చెప్పాలంటే ముందసలు కథ ప్రేక్షకులకు చేరాలి. అప్పుడే మిగితవాటి కోసం మాట్లాడుకున్నా అర్థం ఉంటుంది. నయనతార బాగానే నటించింది. కీరవాణి రీ-రికార్డింగ్ బాగుంది. ఏదేమైనా సంక్లిష్టమైన కథా, కథనంతో కూడిన సినిమాలను రీమేక్ చేసేటపుడు దర్శకులు ఇంకొంచెం శ్రమ పడితే మంచి కథతో కూడినా మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినవారవుతారు. లేదంటే వేరే బాషలో పెద్ద హిట్టయిన సినిమా కూడా తెలుగులో ఫ్లాప్ లిస్టులో చేరిపోతుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.