English | Telugu

అచ్చ తెలుగు బాణీ - కీరవాణి

అచ్చ తెలుగు బాణీ - కీరవాణి

కలికి చిలక పలుకుల తియ్యదనం
జామురాతిరి జాబిలమ్మ చల్లదనం
హైలెస్సో హైలెస్సోల హాయిదనం
పంచధారబొమ్మ గడుసుదనం
రాలిపోయే పువ్వు చెమ్మదనం
అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల కమ్మదనం
అన్నీ కలిసిన అచ్చమైన తెలుగుదనం ఆయన బాణీ..
ఈ రోజుల్లోనూ స్వచ్చమైన తెలుగు సినీ సంగీతం కావలంటే కీరవాణి పాటలే వినాలి.

1989లో ‘మనసు-మమత’ చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఆనాటి నుంచి వందపైగా చిత్రాలకు సంగీతం అందించిన కీరవాణి అసలు పేరు కోడూరి మరకతమణి. తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్‌గా ప్రసిద్ధులు. నవరసభరిత గీతాలన్నిటికీ బాణీలు సమకూర్చగల సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు, సంగీత ప్రధాన చిత్రాలకు ఆయన సంగీతం అందించగలరని నిరూపించుకున్నారు. అలాగే కమర్షియల్ సినిమాల్లోను చక్కటి సంగీత ప్రాధాన్యత గీతాలను అందించారు కీరవాణి. అన్నమయ్య, శ్రీరామదాసు సంగీత ప్రధాన చిత్రాలు కాగా, నా ఆటోగ్రాఫ్, మేజర్ చంద్రకాంత్, నేనున్నాని లాంటి అనేక చిత్రాలలో ఎన్నో అందమైన బాణీలు అందిచారు కీరవాణి. అనగనగా ఒకరోజు లాంటి చిత్రానికి కావలసిన భిన్నమైన సంగీతాన్ని, మగధీరా లాంటి భారీ చిత్రానికి ఆయన సరైన న్యాయం చేయగలిగారు. అందుకే అన్ని రకాల చిత్రాలకు సంగీతం అందించగల ఒకేఒక్క సంగీత దిగ్గజంగా ఆయన పేరు సంపాదించుకున్నారు.
సూపర్ హిట్ జోడీలు - బాణీలు
కళాతపస్వితో కలిసి ఆపద్భాంధవుడు, శుభసంకల్పం చిత్రాలు
రాఘవేంద్ర రావుతో కలిసి దాదాపు 15 చిత్రాలు, అన్నమయ్య, శ్రీరామదాసు, పెళ్లి సందడి, ఝంమ్మంది నాదం, అల్లరిప్రియుడు లాంటి ఎన్నో హిట్ చిత్రాలు
సక్సెస్‌ఫుల్ దర్శకుడు, సోదరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం సమకూర్చారు.
అగ్రహీరోలందరికీ ఆయన ఎన్నో హిట్ బాణీలు అందించారు.
అయితే నాగార్జున సినిమాలకు ఎక్కువగా ఆయన సంగీత దర్శకత్వం వహించారు.

అవార్డులు..
‘అన్నమయ్య’ చిత్రానికి గాను జాతీయస్థాయి ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు. 4 ఫిలింఫేర్ లు, 8 నంది అవార్డులు గెలుచుకున్నారు. వీటితో పాటు అశేష అభిమానులను సంపాదించుకున్నారు.
గాయకునిగానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో కీరవాణి పాటలు పాడారు. వేటూరి సుందరరామమూర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీత రచయిత అవార్డునందుకున్న పాట ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’. ఈ పాటకు బాణీ, వాణీ కీరవాణీయే.

గత 25 సంవత్సరాలుగా సినీ రంగానికి చక్కటి బాణీలు అందిస్తున్న కీరవాణి గారు మరిన్నో పాటలు అందించాలని, ఆయురారోగ్యాలతో వుండాలని కోరుతూ, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది తెలుగువన్.

(4జూలై కీరవాణి పుట్టినరోజు సందర్భంగా)


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.