English | Telugu

లెజెండ్ సినిమాకు 4 కత్తెరలు

బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బాలయ్య తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం నుంచి పోటీ చేస్తున్నాడు. 'లెజెండ్'లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి సినిమా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా సినిమా ఆపేయాలని వారు ఫిర్యాదు చేసారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారులు ఇటీవలే "లెజెండ్" చిత్రాన్ని చూసారు. ‘లెజెండ్’లోని కొన్ని సన్నివేశాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయిని ఎన్నికల అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని తొలగించాలని నిర్మాతను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.