English | Telugu

ఆ ఒక్కడిని బయటపెడతా: ప్రకాష్ రాజ్

నటుడు ప్రకాష్ రాజ్ ను టాలీవుడ్ బహిష్కరించనుంది అని వస్తున్న వార్తలపై ఈరోజు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ...'ఆగడు' సినిమా నుండి నాపై 'మా' ఛాంబర్ రెండు కంప్లయింట్స్ వచ్చాయి. 'మా'వారు నాకు అవి పంపించారు. వాటికీ నేను సమాధానం కూడా ఇచ్చాను. నిజానికి ఈ సినిమా షూటింగ్ సమయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో నా స్థానంలో వేరే నటుడిని తీసుకున్నారు. నాకేం పెద్దగా బాధగా అనిపించలేదు. కానీ మీడియా వస్తున్న వార్తలు... కంప్లయింట్ చేసిన వెంటనే దానిని రెండు వైపుల విచారణ జరిపిన తర్వాతే ఏదైనా బహిష్కరణ లాంటివి చేయాలి. అలాంటివి ఏం చేయకుండా బహిష్కరణ ఎలా చేస్తారు. 'మా' వారు నాకు పంపించిన వారికీ నేను చెప్పినా.."అసలు కంప్లయింట్ ఎవరు ఇచ్చారు? దానికి మద్దతు ఎవరు ఇచ్చారు? వాళ్ళందరిని పిలిపించండి. వాళ్ళందరూ ఒకవైపు.. నేను ఒక్కడిని ఒకవైపు. నేను కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను వారిని. రెండు వైపులా చెప్పేది విన్న తర్వాత మీరే ఏదైనా నిర్ణయం తీసుకోండి. నేను దేనికైనా సిద్ధమే" అని చెప్పాను.

నిజానికి నాకు మెయిల్స్ చాలా వస్తున్నాయి. కానీ నన్ను నమ్మండి నేను ఎలాంటి తప్పు చేయలేదు. జరిగిన సంఘటనను 'మా' అసోసియేషన్ ముందు వీడియో పెట్టబోతున్నాను. కానీ ఈ సమస్య వెనుక ఒక వ్యక్తీ ఉన్నాడు. అతడిని నేను భయటకు తెస్తాను. కానీ అప్పటివరకు ఎలాంటి తప్పుడు వార్తలు రాయకండి. కానీ ఈ కంప్లయింట్ ఇచ్చిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్, నిర్మాతలపై నాకు ఎలాంటి కోపం లేదు. వారు వచ్చి మరో సినిమా చేద్దాం అంటే చేస్తాను. అలాగే మహేష్ తో కూడా నాకు ఎలాంటి గొడవలు లేవు. న గురించి మహేష్ బాగా తెలుసు. కానీ ఆ ఒక్కడి పేరు మాత్రం నేను భయటపెడతాను. ఆ ఒక్కడికి నేనొక పద్యం చెప్పాలనుకుంటున్నాను.

"నన్ను రాళ్ళతో కొట్టకు... పట్టుకొని ఇల్లు కట్టేస్తా!

నన్ను కల్చేయాలని నిప్పు పెట్టకు... ఇంటికి దీపం చేసుకుంటా!

నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని తరమకు... చేరాల్సిన చోటుకి త్వరగా చేరిపోతా!

దయచేసి చెపుతున్నాను...

నన్ను చంపాలని విషం పెట్టకూ.... మింగి నీలకంటుడిని అయిపోతా!

ఒక్కడు ఒక్కడు అని ప్రకాష్ రాజ్ అంటున్న ఆ ఒక్కడు ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్, నిర్మాతలు, హీరో మహేష్ కాకుండా ఇక మిగిలింది దర్శకుడు శ్రీనువైట్ల మాత్రమే. ప్రకాష్ రాజ్ చెప్పే ఆ ఒక్కడు శ్రీను వైట్ల అవుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.