English | Telugu
దసరా బరిలో అక్కాచెల్లెల ఫైట్!
Updated : Sep 26, 2023
దసరా సీజన్ కోసం ఎంటైర్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్. కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగ సీజన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలే అందుకు కారణం. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న భగవంత్ కేసరితో పాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన లియో పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది. వీటి మధ్యనే పోటీ రంజుగా ఉంటే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ సినిమా కూడా లైన్‌లోకి వచ్చింది. వీటి మధ్యనే పోటీ ఉంటే తాజాగా బాలీవుడ్ సినిమా గణ్‌పథ్ కూడా రయ్ మంటూ రేసులోకి వచ్చింది. బాలీవుడ్ యంగ్ స్టార్ టైగర్ ష్రాఫ్.. బ్యూటీ డాల్ కృతి సనన్ జంటగా నటిస్తున్నారు.
టైగర్ ష్రాఫ్‌తో కలిసి కృతి సనన్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టబోతుందని రీసెంట్‌గా రిలీజైన పోస్టర్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అందరూ హీరోల మధ్యనే పోరుని ఆసక్తికరంగా గమనిస్తున్నారు కానీ.. ఇద్దరు హీరోయిన్స్ మధ్య కూడా క్లాష్ ఏర్పడింది. అది కూడా వాళ్లు అక్కాచెల్లెలు కావటం. వారెవరో కాదు.. కృతిసనన్, నుపూర్ సనన్. అది కూడా వీళ్లు పాన్ ఇండియా మూవీస్‌తోనే సై అంటే సై అంటున్నారు. గణ్‌పథ్ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టైగర్ నాగేశ్వరరావు మూవీలో నుపూర్ సనన్ కథానాయిక. నుపూర్ ఇది తొలి మూవీ కావటం విశేషం.మరి ఈ ఆసక్తికరమైన బాక్సాఫీస్ వార్‌లో గెలిచేదెవరో తెలుసుకోవాలంటే దసరా వరకు ఆగాల్సిందే. ఒకవేళ నుపూర్ సనన్ హిట్ కొడితే మాత్రం కచ్చితంగా ఆమె కెరీర్‌లో అదొక మెమరబుల్ మూవీగా నిలిచిపోతుందనటంలో సందేహం లేదు. గణ్‌పథ్ చిత్రాన్ని వికాస్ బల్ డైరెక్ట్ చేస్తుంటే.. టైగర్ నాగేశ్వరరావుని వంశీ తెరకెక్కిస్తున్నారు.