English | Telugu

ఎన్టీఆర్ ఇంటి బయట కొరటాల, అనిరుధ్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ఇంటిముందు నిల్చొని కొరటాల, అనిరుధ్ మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ నివాసం ముందు పార్క్ చేసున్న కారు దగ్గర నిల్చొని కొరటాల, అనిరుధ్ మాట్లాడుతూ కనిపించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఇప్పటికే 'దేవర' షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ గ్యాప్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో చర్చించడానికి కొరటాల, అనిరుధ్ ఆయన ఇంటికి వెళ్లారని.. తిరిగి వెళ్లే సమయంలో ఇలా ఇంటిముందు మాట్లాడుతూ కనిపించారని తెలుస్తోంది.

'దేవర' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుంది. దీనితో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న 'ఎన్టీఆర్ 31', బాలీవుడ్ బడా ఫిల్మ్ 'వార్-2' ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.