English | Telugu

సల్మాన్ ఖాన్ ని కలిసిన కోన వెంకట్

సల్మాన్ ఖాన్ ని కలిసిన కోన వెంకట్ అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సిసియల్ అదేనండి సెలెబ్రిటీస్ క్రికెట్ లీగ్ మన రాష్ట్రంలో జరిగిన సందర్భంగా కోన వెంకట్ ను ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. అప్పుడే సల్మాన్ ఖాన్ తాను త్వరలోనటించబోయే "షేర్ ఖాన్" సినిమాకి చక్కని కథనందించాల్సిందిగా ప్రముఖ రచయిత కోన వెంకట్ ను కోరారట. ఆ "షేర్ ఖాన్" సినిమాకి సంబంధించి కథను హీరో సల్మాన్ ఖాన్ కు చెప్పటానికి కోన వెంకట్ ముంబాయికి వెళ్ళారట.

కోన వెంకట్ చెప్పిన కథ నచ్చటంతో ఆ కథకు స్క్రీన్ ప్లే వ్రాసే బాధ్యతను కూడా కోన వెంకట్ కే సల్మాన్ ఖాన్ అప్పగించినట్లు తేలిసింది. ఈ "షేర్ ఖాన్ ‍" సినిమాకి సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించనున్నాడు. మరో ఒకటి రెండు సిటింగ్స్ లో ఈ "షేర్ ఖాన్" సినిమా కథ ఫైనలైజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "రెడీ" సినిమాకి గోపీ మోహన్ కథను అందించారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.