English | Telugu
నేషనల్ అవార్డ్స్ .. తండ్రీకొడుకుల రేర్ రికార్డ్!
Updated : Aug 25, 2023
కేంద్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 24) 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2021 ఏడాదికిగానూ ప్రకటించిన ఈ జాతీయ పురస్కారాల్లో.. తెలుగు సినిమా పలు విభాగాల్లో సత్తా చాటింది. మరీముఖ్యంగా.. పాన్ ఇండియా సెన్సేషన్ 'ఆర్ ఆర్ ఆర్' ఆరు అవార్డులు అందుకుని వార్తల్లో నిలిచింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'ఆర్ ఆర్ ఆర్'కి గానూ వేర్వేరు విభాగాల్లో తండ్రీకొడుకులు ఎం. ఎం. కీరవాణి, కాలభైరవ అవార్డ్స్ కి సెలెక్ట్ అవ్వడం టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది. 'ఉత్తమ సంగీత దర్శకుడు' కేటగిరిలో 'ఆర్ ఆర్ ఆర్' నేపథ్య సంగీతంకి గానూ కీరవాణి ఎంపికైతే.. 'ఉత్తమ గాయకుడు' విభాగంలో "కొమురం భీముడో" గీతానికిగానూ కాలభైరవ సెలెక్ట్ అయ్యాడు. ఒకే సినిమాకి గానూ తండ్రీకొడుకులిద్దరూ ఇలా అవార్డ్స్ అందుకోనుండడం కచ్చితంగా ప్రత్యేకమైన అంశమే. కాగా, కీరవాణికి ఇది రెండో నేషనల్ అవార్డ్. గతంలో 'అన్నమయ్య' (1997) చిత్రానికిగానూ ఈ పురస్కారం అందుకున్నారాయన.