English | Telugu

రెండో పెళ్లివాడితో రెండో పెళ్లికి రెడి


90వ దశకంలో హిందీ టాప్ హీరోయిన్లలో ఒకరైన కరిష్మా కపూర్ మళ్లీ పెళ్లికి సిద్దమైంది. రాజ్ కపూర్ మనవరాలు, ఇప్పుడూ బాలీవుడ్ అగ్రతార కరీనా అక్క అయిన కరిష్మా సంజయ్ కపూర్ని మొదట వివాహం చేసకుంది. వీరికీ ఇద్దరు సంతానం. కరిష్మా, సంజయ్ కి మధ్య విభేదాలు రావటంతో వారు విడిపోయారు.ఆ తర్వాత అమ్మా, చెల్లి, పిల్లలతో హాయిగానే వున్న కరిష్మాకు, సందీప్ తోష్నివాల్ అనే హాండ్సమ్‌ తో ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ మళ్లీ పెళ్లి చేసుకుందాం అనే వరకు వచ్చింది. సందీప్ తోష్నీవాల్ ముంబైలోని ఓ హెల్త్ కంపెనీకి సీఈవో. వీళ్ళ పెళ్ళికి ఇద్దరి వైపునుంచి పెద్దలు ఓకే అనేశారట. త్వరలో వీరిద్దరూ ఎంచక్కా పెళ్లిచేసుకోబోతున్నారు. కరిష్మాకి ఇది రెండో పెళ్ళి. అలాగేని సందీప్ తోష్నివాల్ బాలాకుమారుడని అనుకోకండి. ఈయనగారు కూడా గతంలో తన మొదటి భార్యకు విడాకులిచ్చేశాడు. మరో విషయం ఏంటంటే రెండు సార్లు రెండో పెళ్లివాడినే వరిచింది కరిష్మా. కరిష్మా మొదటి వివాహం చేసుకున్న సంజయ్ కు, అది ద్వితీయవివాహం.
ఈ పెళ్లితో కరిష్మా ఇద్దరి పిల్లల పరిస్థితి ఏంటో! తండ్రిగా వారిని ఈ కొత్త పెళ్లికొడుకు ఎంతవరకు ఆదరిస్తాడో మరి



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.