English | Telugu

పవన్ పై దూసుకెళ్తున్న ఆగడు

‘ఆగడు' ఈ టైటిల్ ఏ ముహుర్తంలో ఖరారు చేశారో గాని, ఈ చిత్రం టీజర్ రిలీజు అయిన రోజు నుంచే సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టింది. ఆ పరంపర రోజురోజుకు విస్తృతమవుతూనే వుంది. తాజాగా ఆగడు శాటిలైట్ రేట్స్ కొనుగోలుకు పలికిన రేటు కొత్త రికార్డు నెలకొల్పనుంది. ‘ఆగడు' రైట్స్ జెమినీ టివి కొనుగోలు చేయబోతున్నట్లు వార్తలు ఇదివరకే వచ్చాయి. ‘ఆగడు' చిత్రం శాటిలైట్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యే అవకాశాలున్నాయని అందరూ ఊహించారు. కానీ అది పవన్ అత్తారింటికి దారేది చిత్రం నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ‘అత్తరింటికి దారేది’ సినిమా శాటిలైట్ రైట్స్ 9కోట్లకు అప్పట్లో మా టీవి కొనుగోలు చేసింది. ఇప్పుడు ‘ఆగడు' చిత్రం శాటిలైట్ రైట్స్ 9.75 కోట్లకు జెమినీ టివీ కొంటున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ తెలుగు సినిమాలకు సంబంధించి ఇదే హైయ్యేస్టు రికార్డు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. విడుదలకు ముందే ఇన్ని సంచనాలు సృష్టిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడూ ఇంకా అంచనాలు పెరిగిపోవటం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.