English | Telugu
"కరాటే కిడ్" గా వెంకీ కుమారుడు...?
Updated : Dec 10, 2011
"కరాటే కిడ్" గా వెంకీ కుమారుడు నటించాలని ఆశపడెఉతున్నాడట. హాలీవుడ్ లో జాకీచాన్ ప్రథాన పాత్రలో నటించగా నిర్మించబడిన చిత్రం "కరాటే కిడ్". ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ తన కొడుకు అర్జున్ సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ " మా అబ్బాయి అర్జున్ చిన్న పిల్లాడు. వాడిని అప్పుడే సినీ రంగానికి తెచ్చే ఉద్దేశం లేదు. అర్జున్ నాతో ""కరాటే కిడ్" సినిమాని తెలుగులో తీద్దాం డాడీ...అందులో నువ్వు జాకీచాన్ పాత్రలో నటించు...నేను కరాటే కిడ్ గా నటిస్తా"నని అన్నాడు. ఏది ఏ టైమ్ లో ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం ప్లాన్ చేసుకున్నామని జరగవు, మనం ప్లాన్ చేసుకోలేదని ఆగవు కదా...!" అని అన్నారు. అదీ నిజమే కదా...!