English | Telugu
ప్రిన్స్ మహేష్ బాబు సరసన ముగ్గురు అందగత్తెలు
Updated : Dec 9, 2011
ప్రిన్స్ మహేష్ బాబు సరసన ముగ్గురు అందగత్తెలు నటించనున్నారు. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, క్రిష్ దర్శకత్వంలో, సీనియర్ నిర్మాత అశ్వనీదత్ నిర్మించే చిత్రంలో హీరో ప్రిన్స్ మహేష్ బాబు సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం పూర్తయ్యాక ఈ చిత్రం మొదలవుతుందట.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న "బిజినెస్ మ్యాన్ " చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ప్రారంభమవుతుంది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబుకి అన్నయ్యగా ప్రముఖ హీరో విక్టరీ వెకటేష్ నటించటం విశేషం.